News June 15, 2024

హార్దిక్ ఫామ్ భారత్‌కు చాలా కీలకం: పఠాన్

image

భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఫామ్‌లో ఉండటం జట్టు విజయానికి కీలకమని మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. అతడి బౌలింగ్ సరిగ్గా ఉంటే కుల్‌దీప్‌ను ఆడించేందుకు వీలు ఉంటుందని వివరించారు. ‘హార్దిక్ వేసే లెంగ్త్ బాల్స్ వెస్టిండీస్ డ్రై పిచ్‌లకు సరిగ్గా సరిపోతాయి. తను బౌన్సర్స్, కటర్స్ వేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా కష్టం. ఇక తన బ్యాటింగ్ ఎలాగూ ఉండనే ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 21, 2024

కొత్తదారులు వెతకడమే ‘బైడెన్, మోదీ మీటింగ్’ ఎజెండా

image

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం ఏర్పడిన కీలక దేశాల కూటమే క్వాడ్ అని PM మోదీ అన్నారు. అమెరికాకు బయల్దేరే ముందు ఆయన మాట్లాడారు. ‘క్వాడ్ సమ్మిట్లో ప్రెసిడెంట్ బైడెన్, PM అల్బనీస్, PM కిషిదాను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ప్రపంచం మేలు, మన ప్రజల ప్రయోజనం కోసం IND-US అంతర్జాతీయ భాగస్వామ్యం మరింత బలోపేతానికి కొత్త మార్గాలను బైడెన్‌తో సమావేశంలో అన్వేషిస్తాం’ అని అన్నారు.

News September 21, 2024

తిన్న వెంటనే మళ్లీ ఆకలి అవుతోందా?

image

తిన్న వెంటనే మళ్లీ ఆకలిగా అనిపిస్తుందంటే దాని వెనుక నిర్దిష్ట కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వ్యాధుల వల్ల ఇలా అనిపిస్తుందని చెబుతున్నారు. యాంటీ సైకోటిక్ మందులు, స్టెరాయిడ్లు వాడినా, రాత్రి పూట నిద్రలేకపోయినా, ఒత్తిడికి గురైనా, మధుమేహం ఉన్నా శరీరం ఎక్కువ ఆహారం కోరుకుంటుంది. అలాగే సెక్స్ హార్మోన్లలో మార్పులు, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినా, కార్టిసాల్ పెరిగినా ఆహార కోరికలు పెరుగుతాయి.

News September 21, 2024

భారీ వర్షాలు.. 1,15,151 హెక్టార్లలో పంట నష్టం

image

AP: రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 1,15,151 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు తేల్చారు. ప్రభుత్వం ప్రకటించిన <<14129018>>పరిహారం<<>> ప్రకారం 1,86,576 మంది రైతులకు రూ.278.49కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. 1,12,721 కోళ్లు, 564 పాలిచ్చే పశువులు, 719 మేకలు, గొర్రెలు, 207 ఇతర పశువులు మృత్యువాతపడినట్లు గుర్తించారు. వీటికి పరిహారంగా రూ.3.14కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.