News March 27, 2024

హరీశ్, ఎర్రబెల్లిని అరెస్ట్ చేయాలి: రఘునందన్

image

TS: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు, ఎర్రబెల్లిని అరెస్టు చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ‘మునుగోడులో రాజగోపాల్ ఓటమికి ఫోన్ ట్యాపింగే కారణం. ట్యాపింగ్ తొలి బాధితుడు సీఎం రేవంత్. రెండో బాధితుడిని నేనే. హైకోర్టు జడ్జిలు, హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. ఈ కేసులో కేసీఆర్‌ను, హరీశ్‌ను తొలి ఇద్దరు ముద్దాయిలుగా చేర్చాలి. కేసును సీబీఐకి అప్పగించాలి’ అని స్పష్టం చేశారు.

Similar News

News March 23, 2026

‘ధురంధర్-2’ కలెక్షన్ల సునామీ.. పుష్ప-2 రికార్డు సేఫ్

image

‘ధురంధర్- 2’ సినిమా తొలి నాలుగు రోజుల్లో రూ.761 కోట్ల కలెక్షన్లు <<19454612>>సాధించినప్పటికీ<<>> పుష్ప-2 రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఓపెనింగ్ వీకెండ్‌లో రూ.795 కోట్లతో అల్లు అర్జున్ సినిమా టాప్‌లోనే ఉందని Sacnilk వెల్లడించింది. అయితే బాహుబలి-2(రూ.615 కోట్లు), RRR(రూ.568 కోట్లు), KGF-2(రూ.546 కోట్లు) మూవీలను వెనక్కి నెట్టినట్లు పేర్కొంది.

News March 23, 2026

పెండింగ్ బకాయిల విడుదల, PRCపై ప్రభుత్వం కీలక ప్రకటన

image

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. పెండింగ్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా ప్రతినెలా ఇస్తోన్న ₹700 కోట్లను ₹1,000 కోట్లకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 1వ తేదీనే జీతాలు, క్యాష్‌లెస్‌ హెల్త్ కార్డ్స్, పెండింగ్ DAల విడుదల, ₹1.25 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. త్వరలోనే PRCపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 23, 2026

కీలక బిల్లు: విద్వేష ప్రసంగాలు చేస్తే 7 ఏళ్ల జైలు

image

TG: విద్వేష ప్రసంగాలు చేసేవారి భరతం పట్టేలా కీలక బిల్లును GOVT ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇలాంటి ప్రసంగాలు చేస్తే తొలిసారి ₹50000 జరిమానా, 7 ఏళ్ల జైలు విధిస్తారు. రెండోసారి కూడా చేస్తే ₹1 లక్ష జరిమానా, 10 ఏళ్లు జైలు తప్పదు. ఇప్పటికే ఇలాంటి చట్టం కర్ణాటకలో ఉంది. కాగా పేరెంట్స్‌ను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల వేతనం నుంచి 10-15% కట్ చేసి వారికి అందించేలా మరో బిల్లునూ త్వరలో పెట్టనున్నారు.