News November 19, 2024

చేవలేనోనికి బూతులెక్కువ.. సీఎం రేవంత్‌పై హరీశ్ ఫైర్

image

TG: హనుమకొండ సభలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన <<14654336>>వ్యాఖ్యలపై<<>> హరీశ్‌రావు మండిపడ్డారు. చేతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు రేవంత్ పరిస్థితి ఉందని విమర్శించారు. 11 నెలల పాలనలో చేసిందేమీ లేక పిచ్చి మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీ బిడ్డల దాకా రేవంత్ చేసిన ఘోరాలను ప్రజలు మర్చిపోరని చెప్పారు.

Similar News

News December 2, 2024

నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

image

AP: నేటి నుంచి ఈ నెల 28 వరకు కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. అర్హులకు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు అందించనుంది. జగన్ బొమ్మ ఉన్న రేషన్ కార్డులకు బదులు కొత్తవాటిని ఇవ్వనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం తమ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పౌరసరఫరాలశాఖ అధికారికి వెబ్‌సైట్‌లోనూ అప్లై చేసుకోవచ్చు.

News December 2, 2024

జగన్ ఆస్తుల కేసులపై సుప్రీం కీలక ఆదేశం

image

ఏపీ మాజీ CM జగన్ ఆస్తులపై ఉన్న కేసులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను వివరించాలంది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు చార్ట్ రూపంలో అందించాలని ధర్మాసనం తెలిపింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఆదేశించింది.

News December 2, 2024

కోహ్లీ అంటే నా వ్యక్తిగత వైద్యుడికి చాలా ఇష్టం: ఆస్ట్రేలియా PM

image

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ‘స్టార్ స్పోర్ట్స్’తో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నా వ్యక్తిగత వైద్యుడు విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆయనకు కోహ్లీ అంటే ఎంత ఇష్టమో చెప్పేందుకు ఒక్క పదం చాలదు. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను విరాట్‌ను కలుస్తున్నట్లు చెప్తే నమ్మలేకపోయాడు. తప్పనిసరిగా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆయన కోరారు’ అని తెలిపారు.