News January 29, 2025

మరోసారి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా?

image

AP: రాష్ట్ర నూతన డీజీపీగా మరోసారి హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుండటంతో హరీశ్ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. గత ఎలక్షన్ల సమయంలో హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే.

Similar News

News January 16, 2026

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నకిలీ టికెట్ల కలకలం

image

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ విమాన టికెట్ల ఉదంతం కలకలం రేపింది. ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు సిద్ధమైన 8 మంది ప్రయాణికుల టికెట్లు నకిలీవని తేలాయి. ఈ నకిలీ టికెట్ల వెనుక ఏవరైనా ఏజెంట్ల హస్తం ఉందా? లేదా ట్రావెల్ ఏజెన్సీల మోసమా? అనే కోణంలో శంషాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

News January 16, 2026

ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

image

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. వివిధ పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు తమకు కోపం, భయం, బాధ వస్తే వాటిని లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్టులు. ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని, అలా కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.

News January 16, 2026

కనుమ రోజున ఆవులను ఎందుకు పూజించాలి?

image

మన ధర్మశాస్త్రాల ప్రకారం ఆవు శరీరంలో ముక్కోటి దేవతలు ఉంటారు. అందుకే గోపూజ చేస్తే సమస్త దేవతలను పూజించిన ఫలం దక్కుతుంది. ఆవు పృష్ఠ భాగంలో మహాలక్ష్మి నివసిస్తుందని నమ్మకం. అందుకే కనుమ నాడు గోవును పూజిస్తే దారిద్య్రం తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెబుతారు. గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని, గ్రహ దోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని విశ్వాసం.