News January 29, 2025
మరోసారి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా?

AP: రాష్ట్ర నూతన డీజీపీగా మరోసారి హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఎల్లుండితో ముగియనుండటంతో హరీశ్ పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం గుప్తా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DGగా ఉన్నారు. గత ఎలక్షన్ల సమయంలో హరీశ్‌ను ఎన్నికల సంఘం DGPగా నియమించిన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
మంచి మాట – పద్యబాట

కానివాని తోడ గలసి మెలగుచున్న
గానివాని వలెనె కాంతు రతని
తాడి క్రింద బాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినుర వేమ
భావం: దుష్టులతో కలిసి తిరిగితే మంచివాడిని కూడా ఈ లోకం చెడ్డవాడిగానే పరిగణిస్తుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగుతున్నా తాటికల్లు తాగుతున్నాడనే అనుకుంటారు కదా.
News February 13, 2025
కేఎల్ రాహులే మాకు ప్రాధాన్యం: గంభీర్

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ కోచ్ గంభీర్ ఆయనకు అండగా నిలిచారు. ‘టీమ్ ఇండియాకు ప్రస్తుతం రాహులే నంబర్ వన్ వికెట్ కీపర్. అతడే మా ప్రాధాన్యం. పంత్‌కు తన అవకాశాలు తనకొస్తాయి. ఇప్పటికైతే ఇద్దరు కీపర్లను ఆడించే పరిస్థితి లేదు’ అని తేల్చిచెప్పారు. పంత్‌తో పోలిస్తే రాహుల్ బ్యాటింగ్ రికార్డులు మెరుగ్గా ఉండటంతో అతడివైపే జట్టు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది.
News February 13, 2025
కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి

TG: కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం చేయడానికే రీ-సర్వే డ్రామా. ఆధార్‌ను అనుసంధానిస్తూ ఇంటింటికి వెళ్లి మళ్లీ సర్వే చేయాలి. బీసీ కేటగిరీలో ముస్లింలను చేర్చవద్దు. బీసీ జనాభాను తగ్గించవద్దు’ అని ట్వీట్ చేశారు.