News June 24, 2024
మెగాస్టార్‌తో హరీశ్ శంకర్ సినిమా?

మెగాస్టార్ చిరంజీవి తదుపరి చిత్రంపై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు మెగాస్టార్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించనున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
Similar News
News February 20, 2025
గర్భాలు నిలబడటం లేదు!

వెనకటి తరాల వారు పదిమంది పిల్లల్ని కనేవారు. కానీ నేడు గర్భం దాల్చడమే గగనమవుతోంది. మరికొంతమందిలో గర్భాన్ని నిలబెట్టుకోవడం సమస్య అవుతోంది. రెండు మెట్లెక్కితే చాలు గర్భస్రావం అయిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మారిన జీవనశైలి, స్త్రీపురుషులిద్దరిలోనూ తగినంత దృఢత్వం లేకపోవడం, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణమని వివరిస్తున్నారు.
News February 20, 2025
నేడే టీమ్ ఇండియా తొలి సమరం

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ నేడు తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌పై ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఊపులో ఉన్న భారత్‌కు బంగ్లాపై గెలుపు పెద్దగా కష్టం కాకపోవచ్చు. విరాట్, రోహిత్ ఫామ్‌లో ఉన్నారు. అయితే బుమ్రా లేని బౌలింగ్ దళం ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం. అటువైపున్నది బంగ్లాయే అయినా తక్కువ అంచనా వేయొద్దని, నిర్దయగా ఆడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలుకానుంది.
News February 20, 2025
‘శంభాజీ’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు.. నెటిజన్లు ఫైర్

‘ఛావా’లో శంభాజీని ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన సన్నివేశం చరిత్రలో జరగలేదంటూ నటి స్వరభాస్కర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలంటూ ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర చదువుకున్నాను. సినిమాలో చూపించిన హింసలో ఏమాత్రం కల్పితం లేదు’ అని ఒకరు పేర్కొనగా.. ‘శంభాజీ త్యాగాన్ని చులకన చేయడానికి నీకెంత ధైర్యం’ అంటూ మరో నెటిజన్ ప్రశ్నించారు.