News January 30, 2025
హరీశ్ వ్యాఖ్యలు విడ్డూరం: సామ రామ్మోహన్

రేవంత్‌ను ప్యాలెస్ CM అని హరీశ్ రావు విమర్శించడం విడ్డూరంగా ఉందని TPCC నేత సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టిందెవరో అందరికీ తెలుసని దెప్పిపొడిచారు. తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా ప్రజల సీఎం ఎవరో చెబుతారన్నారు. రేవంత్ పనితీరు చూసి కడుపుమంటతోనే BRS అర్థరహిత విమర్శలు చేస్తోందని రామ్మోహన్ ఆరోపించారు. ముందు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో BRS తెలుసుకోవాలని హితవు పలికారు.
Similar News
News December 25, 2025
TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News December 25, 2025
గిగ్ వర్కర్ల సమ్మె: నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

డిసెంబర్ 25, 31 తేదీల్లో స్విగ్గీ, జొమాటో సహా ప్రముఖ సంస్థల డెలివరీ ఏజెంట్లు సమ్మెకు పిలుపునిచ్చారు. పడిపోతున్న ఆదాయం, అధిక పని గంటలు, సెక్యూరిటీ లేని స్పీడీ డెలివరీ లక్ష్యాలకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్‌లో సోషల్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సిటీలతో పాటు టైర్2 పట్టణాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సి రావొచ్చు!
News December 25, 2025
క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం: ఒక్క టీకాతో అన్నింటికీ చెక్!

యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దిశగా US శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒకే ఇంజెక్షన్ వేర్వేరు క్యాన్సర్లను అడ్డుకుంది. ఈ నానోపార్టికల్ టీకాతో 88% ఎలుకలు ప్రాణాంతక ట్యూమర్ల నుంచి బయటపడ్డాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. క్యాన్సర్లు మళ్లీ రాకుండా, ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. త్వరలో మనుషులపై పరీక్షలు జరగనున్నాయి.


