News January 30, 2025

హరీశ్ వ్యాఖ్యలు విడ్డూరం: సామ రామ్మోహన్

image

రేవంత్‌ను ప్యాలెస్ CM అని హరీశ్ రావు విమర్శించడం విడ్డూరంగా ఉందని TPCC నేత సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టిందెవరో అందరికీ తెలుసని దెప్పిపొడిచారు. తెలంగాణలో చిన్న పిల్లాడిని అడిగినా ప్రజల సీఎం ఎవరో చెబుతారన్నారు. రేవంత్ పనితీరు చూసి కడుపుమంటతోనే BRS అర్థరహిత విమర్శలు చేస్తోందని రామ్మోహన్ ఆరోపించారు. ముందు తమ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో BRS తెలుసుకోవాలని హితవు పలికారు.

Similar News

News February 19, 2025

కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

image

AP: మద్దతు ధర లేక ఇబ్బందిపడుతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు CM చంద్రబాబు లేఖ రాశారు. రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సాగు వ్యవసాయానికి విక్రయ ధర మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని సూచించారు. 50శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టం భరించాలని లేఖలో విన్నవించారు.

News February 19, 2025

ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

image

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్‌లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?

News February 19, 2025

మోనాలిసాకు బిగ్ షాక్?

image

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.

error: Content is protected !!