News September 23, 2024
హరియాణా ఎన్నికలు: మహిళలంటే మరీ ఇంత చిన్నచూపా
హరియాణా అంటేనే ఆడవాళ్లపై ఓ చిన్నచూపు! అక్కడ 2023లో ఫీమేల్ బర్త్‌రేట్ 1000కి 916. ఎలక్షన్లలోనూ ఇంతే. 1966 నుంచి అసెంబ్లీకి వెళ్లింది 87 మందే. ఇక మహిళా CM సంగతి దేవుడెరుగు. తాజా ఎన్నికల్లో 90 స్థానాలకు అన్ని పార్టీల నుంచి కలిపి 51 మందే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ 12, INLD, BSP కలిపి 11, BJP 10, JJP, ASP కలిపి 8, AAP 10 మందికి సీట్లిచ్చాయి. ఇందులో మెజారిటీ ప్రముఖులు, రాజకీయ వారసులే కావడం గమనార్హం.
Similar News
News October 9, 2024
అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM
AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.
News October 9, 2024
జో రూట్ సరికొత్త మైలురాయి
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సరికొత్త మైలురాయి అందుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీ బాదారు. ఇప్పటివరకు ఆయన 35 శతకాలు సాధించారు. ఈ క్రమంలో లారా, గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్ధనే (34)లను ఆయన అధిగమించారు. ఓవరాల్‌గా సచిన్ (51), కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (35) టాప్‌లో ఉన్నారు.
News October 9, 2024
నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల
AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్‌ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.