News April 7, 2025

ఒక్క మద్యం డిస్టిలరీనైనా రద్దు చేశారా?: పేర్ని నాని

image

AP: YCP హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పటి వరకు ఒక్క డిస్టిలరీనైనా రద్దు చేశారా? అని పేర్ని నాని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీల అమలుకు దిక్కులేకపోయినా మద్యం ఏరులై పారుతోందన్నారు. కేరళ, బెంగళూరు లిక్కర్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తోందని ఆరోపించారు. మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా? అని నిలదీశారు. మంచి నీళ్లు లేకపోయినా ఫోన్ చేస్తే లిక్కర్ ఇంటికే వస్తోందని మండిపడ్డారు.

Similar News

News April 23, 2025

దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

image

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.

News April 23, 2025

డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

image

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <>https://apdeecet.apcfss.in/<<>>

News April 23, 2025

ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

image

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.

error: Content is protected !!