News May 24, 2024
ఎన్నికల ఫలితాలపై ఇన్వెస్టర్లలో భయం తగ్గిందా?

ఎన్నికల వేళ స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ రికార్డులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 3700 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఎన్నికల తొలి రెండు విడతల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. దీంతో ఫలితాలపై అనుమానాలు వచ్చి తొలుత మార్కెట్లు క్షీణించినా ఆ తర్వాత పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల గురించి ఇన్వెస్టర్లు ఇప్పుడు పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 15, 2025
నాపై రాజకీయ ముద్రతో అవకాశాలు కోల్పోయా.. సింగర్ ఆవేదన

శ్రీకాకుళంలోని అరసవల్లి రథసప్తమి వేడుకల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆహ్వానంతో తానొక కళాకారిణిగా పాల్గొన్నట్లు సింగర్ మంగ్లీ తెలిపారు. ఎన్నికల సమయంలో YCP సంప్రదిస్తే ఒక ఆర్టిస్ట్‌గానే పాటలు పాడానని, BRS, బీజేపీ నేతలకూ పాడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తనపై రాజకీయ ముద్ర వేయడంతో చాలా అవకాశాలు కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తన పాటకు రాజకీయ రంగు పులమొద్దని విజ్ఞప్తి చేశారు.
News February 15, 2025
ఆ రోజు నుంచి మలయాళ సినీ ఇండస్ట్రీ క్లోజ్?

మలయాళ సినిమా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి పరిశ్రమను మూసివేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. అధిక పన్నులు, నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్ & స్క్రీనింగ్‌లతో సహా అన్ని చలనచిత్ర కార్యకలాపాలను నిలిపివేస్తామని వెల్లడించారు.
News February 15, 2025
మోదీని నేను అగౌరవపర్చలేదు: సీఎం రేవంత్

TG: ప్రధాని <<15461493>>మోదీ కులంపై<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పందించారు. మోదీని తాను వ్యక్తిగతంగా అగౌరవపర్చలేదని, పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానన్నారు. అందుకే ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని మాట్లాడానని తెలిపారు. తన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని మండిపడ్డారు. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.