News October 8, 2024
ఇరాన్ అణు పరీక్షలు జరిపిందా..?

తరచూ భూకంపాలు ఎదుర్కొనే ఇరాన్లో అక్టోబర్ 5న వచ్చిన భూప్రకంపనలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్పై ఇరాన్ వందల సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించిన కొన్ని రోజుల తరువాత ఈ ప్రకంపనలు రావడంతో ఇరాన్ అణు పరీక్షలు జరిపిందనే ప్రచారం ఊపందుకుంది. సెమ్నాన్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదవ్వడంతో అణు పరీక్షలపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
సైదాపురం : వంతెనకు మరమ్మతులు చేయరూ?

సైదాపురం నుంచి గూడూరుకి వెళ్లే ప్రధాన రహదారిలో కైవల్య నదిపై వంతెన ఉంది. ఇది రాజంపేట నుంచి గూడూరుకి ప్రధాన రహదారి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.12 ఏళ్ల కిందట నిర్మించిన వంతెనపై గుంత ఏర్పడి కమ్మీలు బయటపడటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
News December 7, 2025
కొడాలి నాని గురించి ప్రశ్న.. వదిలిపెట్టనన్న లోకేశ్

AP: రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికా డల్లాస్లో తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొందరు కొడాలి నాని గురించి అడగ్గా ‘నా తల్లిని అవమానిస్తే నేను వదిలిపెడతానా? మీ తల్లిని అవమానించినా వదిలిపెట్టను. మా అమ్మ రాజకీయాలకు దూరంగా ఉన్నా అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. మీకు ఎలాంటి డౌట్ వద్దు. చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
News December 7, 2025
అన్నింటికీ ఆధారం ‘విష్ణుమూర్తి’

అజస్సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః॥
విష్ణుమూర్తికి పుట్టుక లేదు. ఆయనే అన్నింటికీ అధిపతి. ఏదైనా సాధించగలిగినవాడు. అన్నిటికంటే ముందుంటాడు. వానలు కురిపిస్తాడు. తిరిగి ఆ నీటిని స్వీకరిస్తాడు. ఆయన ఆత్మ అనంతం. కొలవడానికి వీలు కానిది. అన్ని లోకాల పరిణామం నుంచే ఈ సృష్టిని పుట్టించే శక్తి ఆయనకు ఉంది. అందుకే ఆయన అన్నింటికీ ఆధారం. <<-se>>#VISHNUSAHSARANAMAM<<>>


