News October 8, 2024

ఇరాన్ అణు ప‌రీక్ష‌లు జ‌రిపిందా..?

image

త‌ర‌చూ భూకంపాలు ఎదుర్కొనే ఇరాన్‌లో అక్టోబ‌ర్ 5న వ‌చ్చిన భూప్ర‌కంప‌న‌లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ వంద‌ల సంఖ్య‌లో బాలిస్టిక్ క్షిప‌ణ‌లు ప్ర‌యోగించిన కొన్ని రోజుల త‌రువాత ఈ ప్ర‌కంప‌నలు రావ‌డంతో ఇరాన్ అణు ప‌రీక్ష‌లు జ‌రిపింద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. సెమ్నాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదవ్వ‌డంతో అణు ప‌రీక్ష‌ల‌పై పలువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Similar News

News November 14, 2024

‘కంగువా’ మూవీ రివ్యూ & RATING

image

1000 ఏళ్ల క్రితం తన జాతి, ఓ పిల్లాడి తల్లికి ఇచ్చిన మాట కోసం హీరో చేసిన పోరాటమే కంగువా కథ. తన పర్ఫామెన్స్, యాక్షన్ సీన్లతో సూర్య మెప్పించారు. విజువల్స్ బాగున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్లుగా బలమైన ఎమోషన్ సీన్లు లేకపోవడం మైనస్. మ్యూజిక్ బాగున్నా అక్కడక్కడ లౌడ్ BGM ఇబ్బంది కలిగిస్తుంది. ప్రస్తుతానికి, గత జన్మకు డైరెక్టర్ సరిగా లింక్ చేయలేకపోయారు. ఫస్టాఫ్ స్లోగా ఉంటుంది.
RATING: 2.25/5

News November 14, 2024

బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు

image

బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

News November 14, 2024

కార్తీక మాసంలో ఉసిరిని ఎందుకు పూజిస్తారంటే..

image

మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావించే ఉసిరిని కార్తీక మాసంలో పూజించి దాని వద్ద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. ఎండ తక్కువగా ఉండే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి ఉపకరిస్తుందని శాస్త్రీయ వివరణ. కార్తీక వన భోజనాలు సైతం ఉసిరి చెట్ల నీడలో చేయాలని పెద్దలు పేర్కొనడం గమనార్హం.