News February 4, 2025
ప్రధాని మోదీ అమెరికా షెడ్యూల్ ఖరారు?

నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటనలో మోదీ ఈ నెల 13న ట్రంప్‌తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోదీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
Similar News
News February 16, 2025
మోదీ కులంపై ఏంటీ వివాదం? రేవంత్ చెప్పింది నిజమేనా?

గుజరాత్‌కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీది ‘మోద్ ఘాంచి’ కులం. మోదీ జన్మించినప్పుడు ఆయన కులం ఓసీ జాబితాలో ఉండేది. మండల్ కమిషన్ సిఫారసుతో గుజరాత్ ప్రభుత్వం 1994లో ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. అప్పటికి మోదీ ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ మోదీ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీల్లో చేర్చారని సీఎం రేవంత్ అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
News February 16, 2025
ఫాస్టాగ్ కొత్త రూల్స్.. చెక్ చేసుకోండి

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.
News February 16, 2025
నిద్రలేవగానే ఇలా చేయండి

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.