News May 19, 2024

కెప్టెన్సీ మార్పే ఆ జట్ల కొంపముంచిందా?

image

ఐపీఎల్‌లో దిగ్గజ జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. చెరో ఐదు సార్లు కప్పు కొట్టిన ఆ జట్లు ఇలా లీగ్ మధ్యలోనే వైదొలగడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రెండు జట్ల దారుణ ప్రదర్శనకు కెప్టెన్సీ మార్పే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. కీలక సమయాల్లో ఆయా జట్ల సారథులు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఓటమిపాలయ్యాయని చెబుతున్నారు.

Similar News

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.

News July 8, 2025

YSRకు TPCC ఘన నివాళులు

image

TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర పార్టీ నేతలు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

News July 8, 2025

లండన్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా

image

ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా లండన్ చేరుకుంది. హీత్రూ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆటగాళ్లు నేరుగా హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం. కాగా ఎల్లుండి (ఈ నెల 10న) ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత్, ఇంగ్లండ్ జట్లు 5 టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా కొనసాగుతున్నాయి.