News August 5, 2024
భారత్ చేరిన హసీనా.. ఆ తర్వాత UKకు!

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. ఆమె విమానం UPలోని హిండన్ ఎయిర్బేస్లో ల్యాండ్ అయ్యింది. ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లే అవకాశం ఉంది. తనకు ఆశ్రయం కల్పించాలని UK ప్రభుత్వాన్ని హసీనా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతుండగా సైనిక పాలన అమలులోకి వచ్చింది.
Similar News
News January 29, 2026
మేడారంలో నేడే కీలక ఘట్టం.. గద్దెపైకి చేరుకోనున్న సమ్మక్క

TG: మేడారం మహాజాతరలో ఇవాళ ప్రధాన ఘట్టానికి తెరలేవనుంది. భక్తుల కొంగు బంగారం సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువుదీరనుంది. పూజారులు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని తెచ్చి ప్రతిష్ఠిస్తారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఇక ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. నిన్న 40 లక్షల మంది గద్దెలను దర్శించుకున్నారు.
News January 29, 2026
CLRIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 29, 2026
మొక్కజొన్న కంకిలో గింజలు చివరి వరకూ రావాలంటే?

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.


