News August 5, 2024

భారత్ చేరిన హసీనా.. ఆ తర్వాత UKకు!

image

బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. ఆమె విమానం UPలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యింది. ఇక్కడి నుంచి ఆమె లండన్ వెళ్లే అవకాశం ఉంది. తనకు ఆశ్రయం కల్పించాలని UK ప్రభుత్వాన్ని హసీనా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతుండగా సైనిక పాలన అమలులోకి వచ్చింది.

Similar News

News September 15, 2024

రాహుల్ గాంధీ ఓ టెర్రరిస్ట్: కేంద్రమంత్రి

image

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రవ్‌నీత్‌సింగ్ బిట్టూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ నంబర్ వన్ టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆయన తలపై కేంద్రం రివార్డు ప్రకటించాలని అన్నారు. సిక్కులను రాహుల్ విభజించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

News September 15, 2024

కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: సీపీఐ రామకృష్ణ

image

AP: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని CM చంద్రబాబుని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. విలువైన ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తులను కారుచౌకగా కట్టబెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఉక్కు ఫ్యాక్టరీలో మూడో ప్లాంట్ కూడా మూసివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత ఐరన్ ఓర్ గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని CBNకు ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు.

News September 15, 2024

BANతో టీ20లకు గిల్, పంత్‌ దూరం?

image

అక్టోబర్ 7 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే 3 మ్యాచుల టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్, పంత్‌కు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్ లోడ్‌ను మేనేజ్ చేసేందుకు, రాబోయే టెస్ట్ సిరీస్‌ల దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో టీ20 టీమ్‌కు ఎవరెవరు సెలక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది.