News April 17, 2024

నీ పట్టుదలకు హ్యాట్సాఫ్

image

సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఆపలేరు అనడానికి నిదర్శనం కేరళకు చెందిన సారిక. ఈమె పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు. కుడి చేయి పూర్తిగా పని చేయదు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో సారిక 922వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటే విశ్వం మొత్తం మనకు సహకరిస్తుంది అనడాన్ని విశ్వసిస్తానని చెప్పారు.

Similar News

News November 25, 2025

తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

image

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.

News November 25, 2025

మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

image

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్‌లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.

News November 25, 2025

హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

image

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌ వాట్సప్‌ నెంబర్‌: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం పోలీస్‌ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.