News April 17, 2024
నీ పట్టుదలకు హ్యాట్సాఫ్

సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఆపలేరు అనడానికి నిదర్శనం కేరళకు చెందిన సారిక. ఈమె పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు. కుడి చేయి పూర్తిగా పని చేయదు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో సారిక 922వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటే విశ్వం మొత్తం మనకు సహకరిస్తుంది అనడాన్ని విశ్వసిస్తానని చెప్పారు.
Similar News
News July 8, 2025
లండన్‌లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్‌లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్‌లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్‌లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్‌లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
News July 8, 2025
ప్రెస్ క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. రైతు సంక్షేమంపై సీఎం రేవంత్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. సీఎం కోసం ఓ కుర్చీ కూడా వేశామని ఆయన చెప్పారు. ఆయన వస్తే చర్చించడానికి తాను సిద్ధమని స్పష్టం చేశారు. కాగా సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు.
News July 8, 2025
YSRకు TPCC ఘన నివాళులు

TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి టీపీసీసీ నేతలు గాంధీభవన్‌లో నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఇతర పార్టీ నేతలు నివాళుర్పించిన వారిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.