News October 5, 2024

HATSOFF: పిల్లల కోసం హాలీవుడ్ హీరో ఏం చేశాడంటే..

image

పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్‌లో కెప్టెన్ జాక్ స్పారో రోల్‌తో జానీ డెప్ చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఆ పాత్ర బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లో ఓ ఆస్పత్రిలో ఉన్న పిల్లల్ని ఆయన తాజాగా జాక్ స్పారో గెటప్‌లో వెళ్లి అలరించారు. క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారులు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ నవ్వించి ఆనందింపచేశారు. ఆయన సహృదయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Similar News

News November 8, 2025

ఆయిల్ ఫామ్ రైతులకు మేలు చేస్తున్న కీటకం

image

ఆయిల్ పామ్ సాగులో పరాగసంపర్కం కీలకం. దీనిపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఈ పంటలో గాలి ద్వారా సంపర్కం సాధ్యం కాదు. అందుకే జగిత్యాల రైతులు ఆయిల్ పామ్ పంటల్లో పరాగసంపర్కం కోసం ఆఫ్రికన్ వీవిల్ అనే కీటకాన్ని వినియోగిస్తున్నారు. చాలా చిన్నగా ఉండే ఈ కీటకం పరాగ సంపర్కానికి కీలక వాహకంగా పనిచేస్తూ దిగుబడి పెరిగేందుకు సహకరిస్తోంది. దీని వల్ల దిగుబడులు గణనీయంగా పెరిగాయని జగిత్యాల రైతులు చెబుతున్నారు.

News November 8, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) చెన్నై యూనిట్‌లో 14 పోస్టులకు అప్లై చేయడానికి గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 11వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్- సీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్+ఐటీఐ, టెన్త్+నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగినవారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 60

image

1. కృష్ణుడి మొదటి గురువు ఎవరు?
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ఏమంటారు?
3. నాగులకు తల్లి ఎవరు?
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ఎవరు?
5. స్కందుడు అంటే ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>