News October 5, 2024
HATSOFF: పిల్లల కోసం హాలీవుడ్ హీరో ఏం చేశాడంటే..
పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్‌లో కెప్టెన్ జాక్ స్పారో రోల్‌తో జానీ డెప్ చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా చిన్నారులకు ఆ పాత్ర బాగా ఇష్టం. ఈ నేపథ్యంలో స్పెయిన్‌లో ఓ ఆస్పత్రిలో ఉన్న పిల్లల్ని ఆయన తాజాగా జాక్ స్పారో గెటప్‌లో వెళ్లి అలరించారు. క్యాన్సర్ బారిన పడ్డ చిన్నారులు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ నవ్వించి ఆనందింపచేశారు. ఆయన సహృదయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News November 12, 2024
బడ్జెట్ నిరాశపర్చింది: VSR
AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి నిరాశ కలిగించిందని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ‘ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో బడ్జెట్లో చెప్పకపోవడం ప్రజలను మోసం చేయడమే. ప్రజా ప్రయోజనాలు చెప్పకుండా ఈ బడ్జెట్ ప్రసంగం మొత్తం ఆత్మస్తుతి, వైసీపీపై నిందలతోనే నిండిపోయింది. చంద్రబాబు బడ్జెట్ స్వీయపొగడ్తలతో ఒక రాజకీయ కరపత్రంగా మిగిలింది’ అని Xలో విమర్శలు గుప్పించారు.
News November 12, 2024
యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆందోళనలు దృష్ట్యా తవ్వకాలు నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు.
News November 12, 2024
డిసెంబర్ 1 నుంచి బీజేపీ పాదయాత్ర
TG: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చే నెల 1 నుంచి బీజేపీ నేతలు పాదయాత్ర చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని నిరసన తెలుపుతూ పాదయాత్రను చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ సవాలును స్వీకరిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈనెల 15 లేదా 16న మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస చేయనున్నారు.