News January 7, 2025
నాకేమైనా ఉరిశిక్ష పడిందా?: KTR
TG: చట్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతోనే నిన్న తాను ACB విచారణకు హాజరయ్యానని KTR తెలిపారు. కక్ష సాధింపు కేసు అని తెలిసి కూడా వెళ్లానన్నారు. తన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఏదో ఉరిశిక్ష పడినట్లు కాంగ్రెస్ నేతలు ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. కొందరు మంత్రులైతే న్యాయమూర్తుల్లా ఫీలవుతున్నారని సెటైర్లు వేశారు. న్యాయపరంగా ఈ అంశంపై పోరాటం చేస్తానని, లాయర్లతో విచారణకు వెళ్తానని KTR స్పష్టం చేశారు.
Similar News
News January 8, 2025
తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లు బంద్: క్రాషైన కంపెనీ షేర్లు
TGకి కింగ్‌ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్‌ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.
News January 8, 2025
మోదీజీ అమరావతికి రండి: సీఎం చంద్రబాబు
AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
News January 8, 2025
ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
AP: దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే సర్కారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నా. పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. ఇక నుంచి అన్నీ జయాలే. అపజయాలుండవు’ అని ధీమా వ్యక్తం చేశారు.