News November 18, 2024
గతంలో నేను జాయింట్ థెరపీ తీసుకున్నా: ఆమిర్ ఖాన్
తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కూతురు ఐరాతో కలిసి జాయింట్ థెరపీ తీసుకున్నట్లు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ చెప్పారు. మానసిక సమస్యలను తీవ్రంగా పరిగణించాలని సూచించారు. గతంలో ఐరా డిప్రెషన్‌తో బాధపడిందని, దాంతో తాను కూడా లోన్లీగా ఫీలయ్యానన్నారు. డా.వివేక్ మూర్తితో చర్చించి థెరపీ తీసుకోవడం తమకు ఎంతో సహకరించినట్లు చెప్పారు. మనం చేయలేని పనులకు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2024
జగనన్న కాలనీలపై విచారణ చేపట్టండి: స్పీకర్ ఆదేశం
AP: వైసీపీ హయాంలో ప్రారంభించిన జగనన్న కాలనీలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. అధికారుల నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొందరు అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ జగనన్న ఇళ్లపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని తెలిపారు.
News November 18, 2024
గాలి కాలుష్యంతో ఏటా 20 లక్షల మంది మృతి!
దేశంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణాంతక వ్యాధులతో ఏటా లక్షల మంది చనిపోతున్నారని ఆందోళన చెందుతుంటాం. అయితే, నాణ్యమైన గాలిని పీల్చుకోలేకపోవడం వల్ల కూడా ఏటా ఇండియాలో దాదాపు 20 లక్షల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారనే విషయం మీకు తెలుసా? కలుషితమైన గాలిని పీల్చి శ్వాసకోశ వ్యాధులు, ఇతర రోగాలతో బాధపడుతూ నిత్యం 5400 మంది ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం ఈ మహమ్మారిపై దృష్టిసారించాలని నెటిజన్లు కోరుతున్నారు.
News November 18, 2024
అభివృద్ధితో పాటు స్వచ్ఛమైన గాలినీ అందించే నగరాలు!
ఓ వైపు అభివృద్ధిలో దూసుకెళ్తూనే మరోవైపు నగరవాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే మార్గాలను అన్వేషిస్తున్నాయి బెంగళూరు, చెన్నై నగరాలు. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్కడ పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వాయు నాణ్యత సూచీలో వాయు నాణ్యత బెంగళూరులో 82, చెన్నైలో 82గా ఉంది. ఇక కొచ్చిలో అత్యల్పంగా 13AQIతో స్వచ్ఛమైన వాయువు లభించే సిటీగా నిలిచింది.