News October 1, 2024
KGBVల్లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకూ దరఖాస్తు చేయవచ్చు. ఇందులో టీచర్ జాబ్‌లు 507 కాగా, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. OCT 14 నుంచి 16లోగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 19న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి, 23న అపాయింట్‌మెంట్ లెటర్లు అందిస్తారు. వివరాలకు <
Similar News
News October 12, 2024
భారీ వర్ష సూచన.. అధికారులకు హోంమంత్రి ఆదేశాలు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. పోలీసులు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్ఠ పర్చాలని అన్నారు.
News October 12, 2024
ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు: పొన్నం
TG: కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట(D) హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల అంచనా కోసమే సర్వే చేపడుతున్నాం. 60 రోజుల పాటు ఇది కొనసాగుతుంది. దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమం చేపడతాం. కులగణనకు ప్రజలంతా సహకరించాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు.
News October 12, 2024
ఆ విషయంలో భాగస్వామి వద్దకు కాకపోతే ఇంకెవరి వద్దకు వెళ్తారు: హైకోర్టు
నైతిక నాగరిక సమాజంలో ఒక వ్యక్తి (M/F) శారీరక, లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భాగస్వామి వద్దకు కాకుండా ఇంకెవరి దగ్గరకు వెళ్తారని అలహాబాద్ హైకోర్టు ప్రశ్నించింది. భర్తపై పెట్టిన వరకట్నం కేసులో భార్య ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు కొట్టేసింది. ఈ కేసు ఇద్దరి మధ్య లైంగిక సంబంధ అంశాల్లో అసమ్మతి చుట్టూ కేంద్రీకృతమైనట్టు పేర్కొంది.