News March 2, 2025
ఇంటర్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?

తెలంగాణలో మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్టియర్, 6 నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలుత కాలేజీల లాగిన్‌లలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, తాజాగా వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ రోల్ నంబర్/SSC హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <
Similar News
News March 20, 2025
‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.
News March 20, 2025
వారి ఉపాధి పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: జనసేన

AP: కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య తీవ్రం కావడానికి రాజకీయాలే కారణమని పేర్కొంది. నాటి వైఎస్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు పేరుతో చెరువు గట్లను పేల్చేసిందని దుయ్యబట్టింది. కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని తెలిపింది.
News March 20, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వర స్వామి భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 72,388 మంది దర్శించుకోగా.. 26,145 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.