News October 6, 2024

ఈ పండును తిన్నారా?

image

విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.

Similar News

News April 3, 2026

ఓటీటీలోకి వచ్చేసిన ‘ఎస్.సరస్వతి’

image

వరలక్ష్మీ శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎస్.సరస్వతి’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో అందుబాటులో ఉండగా, త్వరలో మరిన్ని భాషలను యాడ్ చేయనున్నారు. మార్చి 6న రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రావు రమేశ్, మురళీ శర్మ, రాధిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

News April 3, 2026

ట్రంప్ మావా.. అసలు నీ బాధేంటి?

image

ఇరాన్‌తో యుద్ధం విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీరు, <<19543167>>ప్రకటనలు<<>> గందరగోళానికి గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ను నాశనం చేశామని, త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామన్నారు. ఇవాళ ఆ దేశం డీల్ చేసుకోవాలని ఒత్తిడి చేశారు. నిజంగానే ఇరాన్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేస్తే మళ్లీ డీల్ కోసం అడుక్కోవడం ఎందుకని SMలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. <<19538873>>హార్ముజ్‌పైనా<<>> ఆయన పూటకో మాట <<19487591>>మాట్లాడటంపై<<>> విమర్శలొస్తున్నాయి.

News April 3, 2026

పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ.458

image

పాకిస్థాన్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో <<19319137>>రెండో సారి<<>> పెట్రోల్, డీజిల్ ధరలను అక్కడి ప్రభుత్వం పెంచింది. 42.7% పెరుగుదలతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్థానీ రూపాయలకు చేరింది. డీజిల్ రేటు 55% పెరిగి 520 PKRకి ఎగసింది. ఇవాళ్టి నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ ధరలు అదుపు తప్పాయని, దీంతో ధరలు పెంచక తప్పలేదని పెట్రోలియం మంత్రి అలీ మాలిక్ అన్నారు.