News October 6, 2024
ఈ పండును తిన్నారా?
విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.
Similar News
News November 4, 2024
రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో 6.8Cr మంది పాల్గొన్నారు. చివరివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, కమల ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.
News November 4, 2024
రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం
TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.
News November 4, 2024
హీరోయిన్‌ను కూడా హీరోలే డిసైడ్ చేస్తారు: తాప్సీ
సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.