News July 6, 2024
ఒక్కసారైనా WC గెలిచావా?.. వాన్‌కు రవిశాస్త్రి కౌంటర్

T20 WC నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు రవిశాస్త్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘వాన్ ఇష్టమొచ్చింది మాట్లాడొచ్చు. కానీ ఆయన మాటలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లండ్ ఎందుకు విఫలమైందో ముందుగా దానిపై దృష్టి పెడితే బెటర్. వాన్ తన కెరీర్లో ఒక్క సారి కూడా ప్రపంచకప్ సాధించలేకపోయారు. అలాంటి వ్యక్తి భారత్‌ను తప్పుబట్టడం ఏంటి?’ అని రవి వ్యాఖ్యానించారు.
Similar News
News November 18, 2025
జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.

రికార్డు స్థాయిలో పసిడి దిగుమతులు

ధరలు పెరుగుతున్నా పసిడికి గిరాకీ తగ్గడంలేదు. రికార్డు స్థాయిలో దిగుమతులు జరుగుతున్నాయి. అక్టోబర్‌లో 14.72 బిలియన్ డాలర్ల బంగారం ఇంపోర్ట్ అయింది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే దాదాపు 3 రెట్లు($4.92Bn) అధికం కావడం గమనార్హం. ఏప్రిల్-అక్టోబర్ మధ్య $41.23Bn దిగుమతులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 21.44%($34Bn) ఎక్కువ. స్విట్జర్లాండ్ నుంచి 40%, UAE నుంచి 16%, సౌతాఫ్రికా నుంచి 10% గోల్డ్ వస్తోంది.