News December 13, 2024
నేటి ‘గూగుల్’ డూడుల్ గమనించారా?
దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.
Similar News
News January 26, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News January 26, 2025
శుభ ముహూర్తం (26-01-2025)
✒ తిథి: బహుళ ద్వాదశి రా.7.17 వరకు
✒ నక్షత్రం: జ్యేష్ట ఉదయం 7.08 గంటల వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: సా.4.30-6.00 వరకు
✒ యమగండం: మ.12.00-1.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1) సా.4.25-5.13 వరకు
✒ వర్జ్యం: సా.3.30-5.09 వరకు
✒ అమృత ఘడియలు: మ.1.34-3.13 వరకు
News January 26, 2025
వందేళ్ల వయసులో ఆమెకు పద్మశ్రీ
గోవా స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించారు లిబియా లోబో సర్దేశాయ్. ఓ క్యాథలిక్ క్రైస్తవ కుటుంబంలో 1924లో జన్మించిన ఆమె, పోర్చుగీసు పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించారు. వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్(Voz da Liberdade) పేరిట అక్కడ 1955లో ఓ భూగర్భ రేడియో కేంద్రాన్ని నడిపి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. గోవాను భారత్‌లో కలిపేందుకు అప్పట్లో ప్రాణత్యాగానికి సైతం ఆమె సిద్ధం కావడం గమనార్హం.