News April 24, 2024
దుబాయ్ ఎలా మారిందో చూశారా..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713855083873-normal-WIFI.webp)
గల్ఫ్ దేశాలను ఇటీవల వరదలు వణికించిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కురిసే వర్షం కొన్ని గంటల్లోనే కురవడంతో నీరు ముంచెత్తింది. ఉపగ్రహ చిత్రాల్లో ఆ తీవ్రత స్పష్టంగా కనిపించింది. నాసాకు చెందిన ల్యాండ్‌శాట్-9 తీసిన ఫొటోల్లో వరద గుంటలు నీలిరంగులో కనిపిస్తున్నాయి. కాగా.. దుబాయ్‌లో వర్షాలు కురవడం మిగిలిన ఖండాల పర్యావరణానికి అంత మంచిది కాదంటూ పర్యావరణ నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
Similar News
News January 19, 2025
కొత్త రేషన్ కార్డులు వీరికే..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737250603611_367-normal-WIFI.webp)
TG: కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గ్రామాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి(మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం JAN 21-24 వరకు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News January 19, 2025
నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించేలా..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737251742705_367-normal-WIFI.webp)
AP: గతేడాది తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలారావు ప్రకటించారు. తాజాగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) రూ.70 లక్షల విలువైన రెండు పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకువచ్చి ల్యాబులో అమర్చారు. వీటితో నెయ్యిలో కల్తీని వందశాతం గుర్తించవచ్చు.
News January 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737243124509_1226-normal-WIFI.webp)
AP: వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తారనే ప్రచారాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఖండించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేయబోదని తేల్చిచెప్పారు. గతంలో జగన్ ప్రభుత్వమే స్మార్ట్ మీటర్లతో రైతుకు ఉరితాడు వేయాలని చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. అటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 9 గంటల విద్యుత్ సరఫరాలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి స్పష్టం చేశారు.