News September 21, 2024
‘దేవర’ కొత్త పోస్టర్ చూశారా?
ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. పోస్టర్‌లో ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని నోవాటెల్ HICCలో జరగనుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్‌కు ముందు రోజు అర్ధరాత్రి నుంచే షోలు పడే ఛాన్స్ ఉంది.
Similar News
News October 7, 2024
రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్ రావు
TG: రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మాఫీ అమలు విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్బీఐ డేటా ప్రకారం చాలా మందికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ఆపి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
News October 7, 2024
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
News October 7, 2024
మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి
మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.