News July 4, 2024
‘సరిపోదా శనివారం’ సెకండ్ లుక్ చూశారా?
నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ నుంచి మూవీ టీమ్ సెకండ్ లుక్‌ను విడుదల చేసింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆగస్టు 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇతర భాషల్లో ఈ సినిమాకు ‘సూర్యస్ సాటర్‌డే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Similar News
News October 16, 2024
సింగిల్ టేక్‌లో 11 నిమిషాల సీన్: వరుణ్ ధవన్
వరుణ్ ధవన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ ‘సిటాడెల్’. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశాన్ని 11 నిమిషాల పాటు సింగిల్ టేక్‌లో చేసినట్లు వరుణ్ వెల్లడించారు. ఇది సిరీస్ క్లైమాక్స్‌లో రానున్నట్లు పేర్కొన్నారు. కాగా ఇది నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ, తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండనుంది.
News October 16, 2024
ఐఏఎస్‌ల పిటిషన్‌పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ
TG: క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్‌లు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మధ్యాహ్నం 2.30గంటలకు వాదనలు విననుంది. ఏపీకి వెళ్లాలంటూ ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను క్యాట్ ఆదేశించిన విషయం తెలిసిందే.
News October 16, 2024
బియ్యాన్ని నానబెట్టి వండితే..
బియ్యాన్ని నానబెట్టి వండితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉంటాయి.
*జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
*బియ్యంలోని పోషకాలు శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయి.
**ఎక్కువ సేపు నానబెట్టకుండా అరగంట సేపు నానబెడితే చాలని చెబుతున్నారు.