News August 30, 2024
HCAను రద్దు చేయాలి: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్
TG: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. దీనిపై విచారణ జరిపించి HCAను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. బీసీసీఐ నిధులను కూడా దుర్వినియోగం చేసిందని మండిపడింది. మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రస్తుత అధ్యక్షుడు జగన్‌మోహన్ హయాంలో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించింది. సుప్రీం తీర్పును హెచ్‌సీఏ ఖాతరు చేయట్లేదని విరుచుకుపడింది.
Similar News
News September 18, 2024
Stock Market: ఐటీ షేర్లు విలవిల
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. ఐటీ సూచీ 2% మేర పతనమవ్వడం, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణం. యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల కోత నిర్ణయం వెలువడే వరకు సూచీల గమనం ఇంతేనని విశ్లేషకులు అంటున్నారు. BSE సెన్సెక్స్ 83,138 (+26), NSE నిఫ్టీ 25,427 (+10) వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, టీసీఎస్, LTIM, విప్రో షేర్లు విలవిల్లాడుతున్నాయి. హీరోమోటో 3% వరకు పెరిగింది.
News September 18, 2024
రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా సాయం చేస్తున్నాం: సీఎం
AP: రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న ప్రజలకు బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి వారికి తోడుగా నిలుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ వరదల సమయంలో 10 రోజులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌నే సచివాలయంగా మార్చుకుని పనిచేశామని, నష్టం అంచనాలను పూర్తి చేసి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని స్థాయిలో సాయం చేస్తున్నామని ట్వీట్ చేశారు. బాధితులకు ఇచ్చే పరిహారానికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు.
News September 18, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల ప్రైవసీ కోసం కొత్త ఫీచర్
టీనేజ్ యూజర్ల ప్రైవసీ కోసం ఇన్‌స్టాలో ‘టీన్ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. దీనితో 13-17ఏళ్ల వయసున్న యూజర్ల అకౌంట్లు ఆటోమేటిక్‌గా ప్రైవేట్‌లోకి వెళ్తాయి. వారి కంటెంట్ ఫాలోవర్స్‌కు మాత్రమే కనిపిస్తుంది. వీరు యాక్సెప్ట్ చేస్తేనే కొత్త ఫాలోవర్స్ యాడ్ అవుతారు. పేరెంట్‌ను యాడ్ చేసి వారి అనుమతితో ఈ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. త్వరలో US, UK, AUS, CANలో, 2025 JAN నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది అందుబాటులోకి రానుంది.