News January 28, 2025
దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు: ‘దంగల్’ నటి

తన కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లగా మీరు ఏం చేయడానికైనా సిద్ధమా అని ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానన్నాను. సౌత్‌లో అయితే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. నేరుగా చెప్పకుండా మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అని చెప్పేవారు’ అంటూ ఆమె పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు!

AP: తూర్పు గోదావరిలో మరో ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురంలోని చెరువుల్లో చేపలకు ఆహారంగా ఇస్తున్నారు. దీంతో చేపలు తినాలా? వద్దా? అని జనాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
News February 13, 2025
శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న అదానీ

శ్రీలంకలో తాము నిర్మించాల్సిన రెండు పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తప్పుకొంటున్నట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ప్రకటించింది. ఆ దేశంలో ఏర్పడిన కొత్త సర్కారు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యోచిస్తోంది. అది తమకు అంతగా లాభించదన్న ఆలోచనతోనే అదానీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలగినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు విలువ బిలియన్ డాలర్ల వరకూ ఉండటం గమనార్హం.
News February 13, 2025
మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు: అచ్చెన్నాయుడు

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి విత్‌డ్రా చేసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వల్లభనేని వంశీ బెదిరించడంతోనే ఇలా జరిగిందన్నారు. తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. దాడికి ప్రతిదాడి చేయాలంటే 8 నెలల సమయం కావాలా? అని ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.