News January 1, 2025

2025లో విమానం ఎక్కి 2024లో ల్యాండ్ అయ్యాడు!

image

డిసెంబర్ 31st అర్ధరాత్రి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం సహజం. అయితే, ఓ వ్యక్తికి మాత్రం ఇది రివర్స్ అయింది. 2025లో విమానం ఎక్కగా 2024లో ల్యాండ్ అయ్యాడు. అదెలా అనుకుంటున్నారా? హాంకాంగ్‌లో 2025 జనవరి 1న 12.38 గంటలకు విమానం ఎక్కగా.. లాస్ ఏంజెలిస్‌లో అతను 2024 డిసెంబర్ 31న రాత్రి 8 గంటలకు ల్యాండయ్యాడు. ఎందుకంటే హాంకాంగ్‌ టైమ్ జోన్ లాస్ ఏంజెలిస్ కంటే 16 గంటల ముందుంటుంది.

Similar News

News January 16, 2025

‘ముక్కనుమ’ గురించి తెలుసా?

image

సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు

News January 16, 2025

పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్

image

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.

News January 16, 2025

ఇండియా ఓపెన్: ప్రణయ్, లక్ష్యసేన్ ఔట్

image

ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, ప్రణయ్ ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాళవిక, ఆకర్షి ఓడిపోయారు. మరోవైపు ఇవాళ స్టార్ ప్లేయర్ సింధు జపాన్ క్రీడాకారిణి సుజుతో తలపడనున్నారు. మరో ప్లేయర్ అనుపమ ఉపాధ్యాయ జపాన్‌కు చెందిన మియజాకితో పోటీ పడనున్నారు.