News November 7, 2024
దేశంలో ఎక్కువగా విరాళమిచ్చింది ఈయనే!
HCL టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అసలైన శ్రీమంతుడిగా నిలిచారు. ఆయన 2024లో రోజుకు రూ.5.9 కోట్లు విరాళంగా అందించినట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో ఇండియాలోని దాతృత్వ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారని తెలిపింది. శివ్ నాడార్ తన ఫౌండేషన్ ద్వారా రూ.2,153 కోట్లు వార్షిక విరాళమిచ్చి మూడోసారి అత్యధికంగా విరాళమిచ్చిన వ్యక్తిగా నిలిచారు. ఆయన ఎక్కువగా విద్య కోసమే అందించారు.
Similar News
News December 13, 2024
బాబోయ్.. ఇదేం చలి!
TG: రాష్ట్రంలోని పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు.
News December 13, 2024
పెదవుల పగుళ్లను నివారించండిలా!
చలికాలంలో ప్రతి ఒక్కరినీ వేధించే సమస్య పెదవుల పగుళ్లు. రాత్రి పడుకునే ముందు పాలతో పెదవులను మర్దన చేసుకొని మార్నింగ్ లేవగానే కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొబ్బరి నూనె, ఆ నూనెతో తయారు చేసిన లిప్ బామ్స్ కూడా పగుళ్లను నివారిస్తాయి. తేనె కూడా పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పూట రాసి ఉదయాన్నే కడిగితే పెదవులు మృదువుగా మారిపోతాయి. వీటితో పాటు తగినంత నీటిని తాగడం ముఖ్యం.
News December 13, 2024
పాకిస్థాన్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ రాజీనామా
పాక్ క్రికెట్ టెస్ట్ జట్టు కోచ్ గిలెస్పీ రాజీనామా చేశారని క్రిక్‌బజ్ తెలిపింది. కొద్దిగంటల్లో పాక్ జట్టు సౌతాఫ్రికాకు టెస్ట్ సిరీస్ కోసం వెళ్లాల్సి ఉండగా ఆయన పాక్ క్రికెట్ బోర్డ్(PCB)కి ఈ విషయం తెలియజేసినట్లు పేర్కొంది. ‘గిలెస్పీ రాజీనామా చేశారు’ అని PCB అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని వివరించింది. దీంతో వన్డే జట్టు తాత్కాలిక కోచ్ ఆకిబ్ జావెద్‌నే టెస్టు జట్టుకూ తాత్కాలికంగా PCB నియమించింది.