News November 26, 2024

3 బంతులకు 30 పరుగులు ఇచ్చేశాడు

image

అబుదాబి T10 లీగ్‌లో BGT ఆల్‌రౌండర్ దసున్ షనక బౌలింగ్‌లో లయ తప్పారు. DBLతో మ్యాచ్‌లో 9వ ఓవర్ వేసిన అతను తొలి 3 బంతుల్లోనే 30(4, 4+nb, 4+nb, 4, 6, nb, 4+nb) పరుగులు, ఆ తర్వాత 3 బాల్స్‌కు 3 రన్స్ ఇచ్చారు. మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి. అనంతరం బ్యాటింగ్‌లో దసున్ 14 బంతుల్లో 33 పరుగులు(3 సిక్సులు, 2 ఫోర్లు) చేశారు. తొలుత ఢిల్లీ 123/6 స్కోర్ చేయగా, బంగ్లా 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

Similar News

News November 26, 2024

Warning: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?

image

ఆండ్రాయిడ్ 12- ఆండ్రాయిడ్ 15 వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ ఫోన్లను వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఓఎస్‌లో చాలా లోపాలున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తేల్చిచెప్పింది. వీటిని హ్యాకర్లు గుర్తిస్తే వినియోగదారుల భద్రతకు తీవ్రస్థాయి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్‌డేట్స్ రాగానే వెంటనే ఫోన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

News November 26, 2024

‘జీబ్రా’కు అలా జరగకూడదని కోరుకుంటున్నా: సత్యదేవ్

image

‘జీబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ఎమోషనల్ పోస్టు చేశారు. ‘ఇది మీరు ఇచ్చిన విజయం. థియేట్రికల్ హిట్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూశా. నేను హిట్ కొడితే మీరు కొట్టినట్లే ఫీల్ అవుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. బ్లఫ్ మాస్టర్ సినిమాను మీరు థియేటర్‌లో మిస్సై తర్వాత OTT, యూట్యూబ్‌లో చూసి ప్రశంసలు కురిపించారు. జీబ్రాకు అలా జరగకూడదు. దయచేసి మూవీని థియేటర్లలో చూడండి’ అని రాసుకొచ్చారు.

News November 26, 2024

నా సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి: స్వరూపానందేంద్ర

image

AP: తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి లేఖ రాశారు. ఇప్పటివరకు రక్షణ కల్పించిన YCP, TDP ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తపస్సు చేసుకుంటూ రిషికేశ్‌లోనే గడుపుతానని ప్రకటించారు. YCP ప్రభుత్వం గతంలో శారదాపీఠానికి వైజాగ్ వద్ద రూ.225Cr విలువైన 15ఎకరాలను రూ.15 లక్షలకే కేటాయించింది. కూటమి ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంది.