News November 26, 2024
3 బంతులకు 30 పరుగులు ఇచ్చేశాడు
అబుదాబి T10 లీగ్‌లో BGT ఆల్‌రౌండర్ దసున్ షనక బౌలింగ్‌లో లయ తప్పారు. DBLతో మ్యాచ్‌లో 9వ ఓవర్ వేసిన అతను తొలి 3 బంతుల్లోనే 30(4, 4+nb, 4+nb, 4, 6, nb, 4+nb) పరుగులు, ఆ తర్వాత 3 బాల్స్‌కు 3 రన్స్ ఇచ్చారు. మొత్తంగా ఆ ఓవర్‌లో 33 రన్స్ వచ్చాయి. అనంతరం బ్యాటింగ్‌లో దసున్ 14 బంతుల్లో 33 పరుగులు(3 సిక్సులు, 2 ఫోర్లు) చేశారు. తొలుత ఢిల్లీ 123/6 స్కోర్ చేయగా, బంగ్లా 9.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
Similar News
News December 13, 2024
అల్లు అర్జున్‌కు ఏమైంది?
ఇటీవల పలు ఈవెంట్లలో చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ వ్యవహారంపై కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. మొన్న ఈవెంట్‌లో <<14819498>>తెలంగాణ CM పేరును<<>> ఆయన మరిచిపోయారని చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ ఈవెంట్‌లోనూ సుకుమార్ పేరును <<14859353>>సుకుమార్ రెడ్డి<<>> అని సంబోధించారు. అయితే మరోసారి ఐకాన్ స్టార్ పొరబడ్డారని పలువురు పోస్టులు పెడుతున్నారు. దీంతో అల్లు అర్జున్‌కు ఏమైందని కామెంట్లు చేస్తున్నారు.
News December 13, 2024
అత్యధిక చెస్ టైటిళ్లు గెలిచిన దేశం ఏదంటే?
వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌ను అత్యధిక సార్లు గెలిచిన దేశంగా సోవియట్ యూనియన్(17) నిలిచింది. రెండో స్థానంలో రష్యా(6), ఇండియా (6), మూడో స్థానంలో నార్వే (5) ఉన్నాయి. USA, ఉక్రెయిన్, చైనా, ఉబ్జెకిస్థాన్, బల్గేరియా ఒక్కో టైటిల్ సాధించి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
☛ 1991లో సోవియట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయింది.
News December 13, 2024
పలువురికి పదవులు కేటాయించిన YCP
AP: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(PAC) మెంబర్‌గా YCP నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ CM జగన్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అటు, వినుకొండ నియోజకవర్గానికి చెందిన పఠాన్ సలేహా ఖాన్‌ను పల్నాడు జిల్లా మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా నియమించింది. అలాగే, మైలవరం నియోజకవర్గానికి చెందిన పామర్తి శ్రీనివాసరావును NTR జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ YCP ఉత్తర్వులు జారీ చేసింది.