News March 2, 2025
టీ తాగేందుకు రైలు దిగాడు.. కానీ 20 ఏళ్లుగా..!

AP: టీ తాగేందుకు రైలుదిగి 20 ఏళ్లపాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పారావు 2005లో పుదుచ్చేరి వెళ్తూ TNలోని ఓ రైల్వే స్టేషన్లో టీ తాగుదామని దిగాడు. మళ్లీ ఎక్కేలోపే ఆ రైలు వెళ్లిపోయింది. చేతిలో డబ్బుల్లేక అటు ఇటు తిరుగుతూ కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అన్నాదురై అనే వ్యక్తికి చెందిన గొర్రెలను ఒక్క రూపాయి జీతం లేకుండా మేపి వెట్టిచాకిరీ చేశాడు.
Similar News
News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
News November 19, 2025
లక్కీ డిప్‌కు ఎంతమంది సెలెక్ట్ అవుతారు?

తిరుమల శ్రీవారి విశేష సేవల కోసం ప్రతి నెలా దాదాపు 4-5 లక్షల మంది భక్తులు లక్కీ డిప్‌కు దరఖాస్తు చేసుకుంటారు. ఇందులో కేవలం 7,500 నుంచి 8,500 మందికి మాత్రమే సేవల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వీరు శ్రీవారిని తొలి గడప నుంచి అతి దగ్గరగా దర్శించుకునే అదృష్టాన్ని పొందుతారు. లక్కీ డిప్లో ఎంపిక కానివారు, శ్రీవాణి ట్రస్ట్‌కు ₹10 వేలు విరాళం ఇచ్చి కూడా మొదటి గడప దర్శనం ద్వారా శ్రీవారిని వీక్షించవచ్చు.
News November 19, 2025
BOBలో 82 పోస్టులకు నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా(<


