News March 2, 2025
టీ తాగేందుకు రైలు దిగాడు.. కానీ 20 ఏళ్లుగా..!

AP: టీ తాగేందుకు రైలుదిగి 20 ఏళ్లపాటు వెట్టిచాకిరీలో మగ్గిపోయిన ఓ వ్యక్తి దీనగాథ ఇది. విజయనగరం జిల్లాకు చెందిన అప్పారావు 2005లో పుదుచ్చేరి వెళ్తూ TNలోని ఓ రైల్వే స్టేషన్‌లో టీ తాగుదామని దిగాడు. మళ్లీ ఎక్కేలోపే ఆ రైలు వెళ్లిపోయింది. చేతిలో డబ్బుల్లేక అటు ఇటు తిరుగుతూ కలైయార్కోయిల్ ప్రాంతానికి చేరుకున్నాడు. అన్నాదురై అనే వ్యక్తికి చెందిన గొర్రెలను ఒక్క రూపాయి జీతం లేకుండా మేపి వెట్టిచాకిరీ చేశాడు.
Similar News
News March 27, 2025
సంపన్నులు ఇష్టపడే ప్రదేశాలు ఇవే!

భారత్‌కు చెందిన 22 శాతం మంది అతి సంపన్నులు విదేశాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు కోటక్ ప్రైవేట్-ఈవై సర్వేలో తేలింది. ఎక్కువగా US, UK, UAE, కెనడా, ఆస్ట్రేలియాలో నివసించేందుకు ఇష్టపడుతున్నారు. రూ.300 కోట్లకుపైగా ఆస్థి కలిగిన వారు క్వాలిటీ లైఫ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల అక్కడ స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. పిల్లల స్టడీ కోసం కూడా ఆయా దేశాలకు వలస వెళ్లాలని భావిస్తున్నారు.
News March 27, 2025
సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.
News March 27, 2025
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.