News September 25, 2024
ఒకే ఇన్నింగ్స్‌లో 86 ఫోర్లు కొట్టాడు
గుజరాత్ గాంధీనగర్‌లో జరిగిన U-18 టోర్నీలో ద్రోణా దేశాయ్ రికార్డు సృష్టించాడు. 320 బంతుల్లో 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 రన్స్ చేశాడు. అయితే 500 మార్క్ చేరుకోలేకపోవడం బాధించిందన్నాడు. గ్రౌండ్‌లో స్కోర్ బోర్డు లేకపోవడం, సహచరులు సైతం ఆ విషయం చెప్పలేదని తెలిపాడు. దీంతో స్ట్రోక్ ఆడేందుకు వెళ్లి ఔట్ అయినట్లు చెప్పాడు. ఇంత భారీ స్కోర్ సాధించిన వారి జాబితాలో దేశంలోనే దేశాయ్ 6వ స్థానంలో నిలిచాడు.
Similar News
News October 7, 2024
యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి!
‘విద్వేషం పాలించే దేశం ఉంటుందా, విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా, ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా, అడిగావా భూగోళమా, నువ్ చూశావా ఓ కాలమా’ అన్న సిరివెన్నెల లిరిక్స్ అక్షర సత్యాలు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ఏడాది. రష్యా-ఉక్రెయిన్ వార్ రెండేళ్లు దాటేసింది. ఏవీ ఇప్పట్లో ముగిసేలా లేవు. తప్పెవరిదన్నది పక్కన పెడితే ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. యుద్ధాల్లేని భూగోళం కోసం ఏం చేయాలి? మీ కామెంట్.
News October 7, 2024
సలార్-2 నుంచి క్రేజీ లీక్స్.. PHOTOS వైరల్
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ నటించిన సలార్ సూపర్ హిట్ కావడంతో రెండో పార్ట్ శౌర్యాంగపర్వంపై అంచనాలు పెరిగాయి. గతంలోనే ఈ చిత్ర షూటింగ్ కొంత పూర్తవగా, దీనికి సంబంధించి టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్ వైరలవుతున్నాయి. కాటేరమ్మ ఫైట్ కంటే క్రేజీగా ఉంటుందని టాక్. ఈ లీక్స్‌పై మేకర్స్ స్పందించలేదు. ప్రస్తుతం డైరెక్టర్, హీరో బిజీగా ఉండటంతో రెండో భాగం షూటింగ్ మరింత ఆలస్యం కానుంది.
News October 7, 2024
5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO
JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.