News October 10, 2024
ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం: టాటా సన్స్ ఛైర్మన్

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తనకు మెంటార్, గైడ్తో పాటు మంచి స్నేహితుడన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా ముద్ర వేశారన్నారు. సమాజ సేవ పట్ల టాటా అంకితభావం లక్షలమందికి మేలు చేసిందని తెలిపారు. టాటా ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Similar News
News November 24, 2025
మంచిర్యాల: ఓటు వేయడానికి రెడీనా..!

మంచిర్యాల జిల్లాలోని గ్రామపంచాయతీలకు సర్పంచ్ రిజర్వేషన్లను ఈ విధంగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 306 గ్రామపంచాయతీలు, 2,680 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 65, ఎస్సీ 81, బీసీ 23, జనరల్ 137 స్థానాలు కేటాయించారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
News November 24, 2025
ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 24, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 710 తగ్గి రూ.1,25,130కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 650 పతనమై రూ.1,14,700 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,71,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


