News October 10, 2024

ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకం: టాటా సన్స్ ఛైర్మన్

image

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు. ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తనకు మెంటార్, గైడ్‌తో పాటు మంచి స్నేహితుడన్నారు. పని పట్ల ఆయన నిబద్ధత, నిజాయితీ, ఆవిష్కరణలతో అంతర్జాతీయంగా ముద్ర వేశారన్నారు. సమాజ సేవ పట్ల టాటా అంకితభావం లక్షలమందికి మేలు చేసిందని తెలిపారు. టాటా ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Similar News

News November 4, 2024

ఇంకా 35 రోజులే మిగిలింది.. మీ హామీలెక్కడ?: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిందని X వేదికగా KTR విమర్శలు గుప్పించారు. ‘100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 330 రోజులు ముగిశాయి. ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలింది. 2లక్షల ఉద్యోగాలు, రైతు భరోసా, రూ.4వేల పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు. జవాబు చెప్తావా రాహుల్ గాంధీ?’ అని ప్రశ్నించారు.

News November 4, 2024

రేపే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

image

అమెరికా అధ్యక్ష ఎన్నికల మహా సంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెర లేవనుంది. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో 6.8Cr మంది పాల్గొన్నారు. చివరివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ట్రంప్, కమల ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ట్రంప్, కమల మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.

News November 4, 2024

రాష్ట్రంలో పెరిగిన భూగర్భ జలమట్టం

image

TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్‌లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 8.69 మీటర్లు, ఆదిలాబాద్ 7.66 మీ. భూపాలపల్లిలో 7.35 మీ. మహబూబ్‌నగర్‌లో 6.94 మీ. మేర జలమట్టం పెరిగింది. యాదాద్రి-భువనగిరి జిల్లాలో అత్యల్పంగా 2.64 మీటర్ల మట్టం పెరిగింది.