News January 5, 2025

నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: హీరోయిన్

image

తనను ఓ బిజినెస్‌మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు’ అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.

Similar News

News January 7, 2025

రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్

image

నటి సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘సరైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. అది జీవితంలో ఆనందాన్ని నింపుతుంది’ అని రాసుకొచ్చారు. 2020లో ఆమె ముస్లిం మతగురువు అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకోగా 2023లో ఓ బాబు జన్మించాడు. సనా ఖాన్ తెలుగులో కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

News January 7, 2025

భారీ భూకంపం.. 53కి చేరిన మరణాలు

image

నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. టిబెట్‌లో ఇప్పటివరకు 53 మంది మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. 62 మందికి గాయాలైనట్లు తెలిపింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.

News January 7, 2025

రోహిత్, కోహ్లీ కమ్‌బ్యాక్ చేస్తారు: యువరాజ్

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తన కుటుంబం అని భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అన్నారు. ఆ ఫ్యామిలీకి మద్దతుగా నిలవడం తన బాధ్యత అని చెప్పారు. వారు కచ్చితంగా గట్టి కమ్‌బ్యాక్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన BGTలో రోహిత్, విరాట్ ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రాణించేందుకు వీరిద్దరూ సన్నద్ధమవుతున్నారు.