News January 5, 2025

నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు: హీరోయిన్

image

తనను ఓ బిజినెస్‌మెన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మలయాళ హీరోయిన్ హనీ రోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్‌కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు’ అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.

Similar News

News January 22, 2025

నోటిఫికేషన్ వచ్చేసింది..

image

UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) నోటిఫికేషన్ రిలీజైంది. 979 పోస్టుల భర్తీకి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 25న ప్రిలిమ్స్ జరగనుంది. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, 21-32 ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు సైట్: <>https://upsconline.gov.in<<>>

News January 22, 2025

అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11వేల కోట్ల నిధులు విడుదల చేసేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ తెలిపారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం పొందేందుకు చర్చలు జరిపామన్నారు. దీంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని నారాయణ పేర్కొన్నారు.

News January 22, 2025

కృష్ణ జన్మభూమి కేసు: స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

image

మథురలో షాహీ ఈద్గాను కోర్టు కమిషనర్ తనిఖీ చేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆర్డర్‌పై తాత్కాలిక స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. 2025, ఏప్రిల్ 1కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. కృష్ణ జన్మస్థానమైన ఇక్కడి మందిరాన్ని ఔరంగజేబు కూల్చేసి ఈద్గా నిర్మించాడన్నది చరిత్ర. ఇక్కడ పూజచేసుకొనే హక్కు కల్పించాలని హిందూ సంఘాలు స్థానిక కోర్టుకెళ్లడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.