News August 22, 2024
ప్రస్తుత క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ అతనే: సౌథీ
భారత స్టార్ బౌలర్ బుమ్రాపై న్యూజిలాండ్ కెప్టెన్ సౌథీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కొనియాడారు. ‘సియట్’ అవార్డుల వేడుకలో ఆయన మాట్లాడారు. మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా అతనికి ఉందని చెప్పారు. గాయం నుంచి కోలుకొని కమ్ బ్యాక్‌లో మెరుగ్గా రాణించడం గొప్ప విషయమన్నారు.
Similar News
News September 15, 2024
విమాన ఆలస్యంపై షమీ పోస్ట్.. సోనూ సూద్ ఫన్నీ రిప్లై
తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైందంటూ క్రికెటర్ షమీ చేసిన పోస్టుకు యాక్టర్ సోనూ సూద్ సరదాగా స్పందించారు. ‘మళ్లీ నా ఫ్లైట్ ఆలస్యమైంది. ఎయిర్‌పోర్టు నాకు టెంపరరీ ఇల్లుగా మారిపోయింది’ అంటూ బాధగా ఉన్న ఫొటోలను షమీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఏమైందంటూ పలువురు కామెంట్స్ చేశారు. వీటికి సోనూ రిప్లై ఇస్తూ ‘భయ్యా.. ఎవరూ టెన్షన్ పడొద్దు. ఆయన ఇంట్లో పడుకున్నట్లే అక్కడా నిద్రపోతారు’ అని రాసుకొచ్చారు.
News September 15, 2024
సెప్టెంబర్ 15: చరిత్రలో ఈరోజు
1861: ప్రఖ్యాత ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జననం
1892: పద్మభూషణ్ గ్రహీత, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు పృథ్వీసింగ్ ఆజాద్ జననం
1942: నటుడు సాక్షి రంగారావు జననం
1967: ప్రముఖ నటి రమ్యకృష్ణ జననం
1972: ప్రముఖ డైరెక్టర్ కె.వి.రెడ్డి మరణం
జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
News September 15, 2024
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరు: వడ్డే
AP: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కూటమి నేతలు స్పందించకపోవడం దారుణమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోకపోతే చంద్రబాబును ప్రజలు క్షమించరని స్పష్టం చేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వైజాగ్ వచ్చి వెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదన్నారు. ఆ శాఖ సహాయ మంత్రిగా APకి చెందిన శ్రీనివాసవర్మ ఉన్నప్పటికీ బ్లాస్ట్ ఫర్నేస్ మూతపడిందని దుయ్యబట్టారు.