News July 5, 2024
భారత క్రికెటర్లను భయపెట్టింది ఇతడే(PHOTO)

నిన్న ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో భారత ప్లేయర్లను దగ్గరగా చూడాలని ఓ ఫ్యాన్ చెట్టుపైకి ఎక్కాడు. బస్సు చెట్టు దగ్గరకు రాగానే ప్లేయర్లు ఒక్కసారిగా అతడిని చూసి భయపడ్డారు. తాజాగా అతడి ఫొటో బయటకు వచ్చింది. T20WCలో ఇతర జట్లను వణికించి కప్ సాధించిన భారత ప్లేయర్లను భయపెట్టింది ఇతడే అంటూ నెటిజన్లు ఫన్నీగా అతడి ఫొటోపై కామెంట్ చేస్తున్నారు. జట్టును దగ్గరగా చూసే ఛాన్స్ కొట్టేశావంటూ మెచ్చుకుంటున్నారు.
Similar News
News December 14, 2025
రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

TG: కాంగ్రెస్ అగ్రనేత <<18553262>>రాహుల్<<>> హైదరాబాద్ పర్యటనపై BRS విమర్శలకు దిగింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రక్తమోడుతుంటే TG వచ్చేందుకు ఆయనకు సమయంలేకుండా పోయిందని <
News December 14, 2025
కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.
News December 14, 2025
డిసెంబర్ 14: చరిత్రలో ఈ రోజు

✤ 1799: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మరణం
✤1924: బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ జననం
✤ 1978: నటి సమీరా రెడ్డి జననం
✤ 1982: దక్షిణాది నటుడు ఆది పినిశెట్టి జననం
✤ 1984: నటుడు రానా జననం(ఫొటోలో)
✤ 2014: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు పీజే శర్మ మరణం
✤ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం
✤ అంతర్జాతీయ కోతుల దినోత్సవం


