News August 15, 2024
సచిన్ రికార్డు బ్రేక్ చేసేది అతడే: పాంటింగ్
టెస్టుల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ బ్రేక్ చేస్తాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం టెస్టుల్లో రూట్ 12,027 పరుగులతో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా సచిన్ 15,921 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నారు. పాంటింగ్(13,378), కల్లిస్(13,289), ద్రవిడ్(13,288), కుక్(12,472), సంగక్కర(12,400) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Similar News
News September 10, 2024
భారత్ రానున్న జెలెన్‌స్కీ?
ఈ ఏడాది చివరి నాటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్ పోలిష్‌చుక్ తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా జెలెన్‌స్కీని మోదీ ఆహ్వానించారని, అది జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. తమ అధ్యక్షుడు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
News September 10, 2024
సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?
సముద్రాల్లోని నీరు సూర్యుడి వేడికి ఆవిరై మేఘాలుగా వర్షించి నదుల్లోకి చేరుతుంది. ఆ నది సముద్రంలోకి వచ్చే క్రమంలో అనేక ప్రదేశాల్లో ప్రవహిస్తూ ఆయా ప్రాంతాల లవణాలను తనలో కలుపుకొంటూ సముద్రంలో చేరుతుంది. నీటి గాఢత తక్కువగా ఉండటంతో నదుల్లో నీరు ఉప్పగా అనిపించదు. కానీ సాగరాల్లో లవణాలు ఎటూ పోయే దారి ఉండదు. అటు సముద్రాల అడుగున భూమి పొరల నుంచి కూడా లవణాలు అందులో కలుస్తుండటంతో ఆ నీరు ఉప్పగా ఉంటుంది.
News September 10, 2024
టాటా మోటార్స్ బంపరాఫర్
పండుగల సీజన్ సందర్భంగా టాటా మోటార్స్ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పాపులర్ కార్లు, SUVలపై రూ.2.05 లక్షల వరకూ ధరలు తగ్గించింది. ఈ ఆఫర్లు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే డీలర్ వద్ద ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.45వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అన్ని రకాల పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ కార్లపైనా ధరల తగ్గింపు ఉంటుందని టాటా మోటార్స్ తెలిపింది.