News August 10, 2024

పదకొండేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయాడు.. పట్టుదలతో కాంస్యం

image

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సొంతం చేసుకున్న అమన్(21) పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. మేనమామ సుధీర్ చేరదీయగా, రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. కోచ్ లలిత కుమార్ వద్ద శిక్షణ ప్రారంభించి 2021లో మొదటి జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్యం, 2023లో బంగారు పతకం సాధించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన ఏకైక పురుష రెజ్లర్‌గా నిలిచి సత్తా చాటారు.

Similar News

News September 8, 2024

రూల్ ఆఫ్ లాపై బీజేపీకి నమ్మకం లేదు: రాహుల్‌

image

BJP పాలిత రాష్ట్రాల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని అమ‌లు చేయాల్సిన వారే వాటిని తుంగ‌లో తొక్కుతున్నార‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ మండిప‌డ్డారు. యూపీలో మంగేష్ యాద‌వ్ అనే యువ‌కుడిని పోలీసులు ఎన్‌కౌంట‌ర్ చేయడంపై ఆయ‌న స్పందించారు. ఈ ఉదంతం రూల్ ఆఫ్ లాపై BJPకి న‌మ్మ‌కం లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేసింద‌న్నారు. BJP ప్రభుత్వ హయాంలో STF వంటి దళం ‘క్రిమినల్ గ్యాంగ్’లా పనిచేస్తోందని విమ‌ర్శించారు.

News September 8, 2024

PARALYMPICS: భారత్ ఖాతాలో మరో స్వర్ణం

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. జావెలిన్ F41 కేటగిరీ ఫైనల్‌లో నవదీప్ సింగ్ 47.32 మీటర్ల దూరం బల్లెం విసిరి విజేతగా నిలిచారు. ఇరాన్ జావెలిన్ త్రోయర్ సదేఘ్ 47.64 మీటర్లు విసిరినా నిర్వాహకులు ఆయన డిస్‌క్వాలిఫై చేశారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నవదీప్‌ను గోల్డ్ మెడల్ విజేతగా ప్రకటించారు. కాగా భారత్ ఖాతాలో ఇప్పటివరకు 29 పతకాలు చేరాయి.

News September 8, 2024

సెప్టెంబర్ 08: చరిత్రలో ఈ రోజు

image

1910: సినీ దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం
1933: బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లే జననం
1936: మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి జననం
1951: డైరెక్టర్ మాధవపెద్ది సురేష్ జననం
1986: బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ జననం
1999: టీమ్ ఇండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ జననం
2020: టాలీవుడ్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణం
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం