News August 6, 2024

విప్లవాన్నే తన పేరుగా మార్చుకున్నాడు

image

గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. భగత్ సింగ్ స్ఫూర్తిగా గదర్ పేరును ఆయన పెట్టుకున్నారు. గదర్ అంటే విప్లవం అని అర్థం. కాలక్రమేణా అది గద్దర్‌గా మారింది. 1969లో తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మలిదశ ఉద్యమంలో ఆయన పాట తెలంగాణ గొంతుగా మారింది. ‘బానిసలారా లెండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా’ అంటూ ఆలోచింపజేశారు. ఆయన ఇప్పుడు సజీవంగా లేకున్నా పాట రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇవాళ ఆయన వర్ధంతి.

Similar News

News September 10, 2024

విశాఖకు మరో వందేభారత్?

image

AP: విశాఖకు మరో వందే భారత్ రైలును నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశాలోని దుర్గ్-విశాఖపట్నం మధ్య నడిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఉదయం 6 గంటలకు దుర్గ్‌లో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు వెళ్తుందని తెలుస్తోంది.

News September 10, 2024

ప్రపంచంలోని 20 శాతం చెత్త భారత్‌లోనే

image

ప్రపంచంలోని ప్లాస్టిక్ చెత్తలో 20 శాతం భారత్‌దేనని ఓ సర్వే తెలిపింది. ఏటా 9.3 మిలియన్ల టన్నుల చెత్తను ఉత్పత్తి చేస్తోందని పేర్కొంది. భారత్ తర్వాత నైజీరియా (3.5 Mt), ఇండోనేషియా(3.4 Mt), చైనా(2.8 Mt), పాకిస్థాన్(2.6 Mt), బంగ్లాదేశ్(1.7 Mt), రష్యా(1.7 Mt), బ్రెజిల్(1.4 Mt), థాయిలాండ్(1 Mt) కాంగో (1 Mt) ఉన్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు లేకపోవడంతో చెత్త పెరుగుతోంది.

News September 10, 2024

నేడు తాడేపల్లికి జగన్ రాక

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను రేపు ఆయన పరామర్శించనున్నారు. అదే జైల్లో ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా జగన్ కలవనున్నారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.